ఓం నమః శివాయ
భగవంతునికి షోడశోపచార పూజా విధానం ...
షోడశోపచారాలు - 16 వుపచారములు అని అర్ధం. ఎలాగో చూద్దాం..
1. ధ్యానం - భగవంతుడు విశ్వవ్యాప్తం సర్వ పదార్ధం ఆయనే అటువంటి భగవంతున్నిఅమ్మవారి సహితంగా ఇష్ట దైవ రూపంలో ధ్యానం చేయాలి. ఆ రూపాన్ని దర్శించాలి . ఇదియే ధ్యానం .
2. ఆవాహనం - ధ్యానంలో కనిపించిన భగవంతున్ని పూజా గదిలోకి పిలవాలి . ఇదియే ఆవహనం.
౩. ఆసనం - పూజా గదిలోకి వచ్చిన భగవంతునికి కూర్చోవడానికి ఆసనం సమర్పించాలి. ఆస్నంగా అక్షత సమర్పించాలి . అక్షత అనగా విరగని బియ్యం .భక్తీతో సమర్పించిన అనంతరం సింహాసనం ఏర్పడుతుoది. అమ్మవారితో ఆ స్వామి వారు ఆసనంలో కూర్చుంటాడు . ఇదియే ఆసనం సమర్పించడం .
4. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు సమర్పించాలి - '' పాదయో; పాద్యం సమర్పయామి '' అని నీళ్ళు సమర్పించి అమ్మవారు స్వామివారు కాళ్ళు మీరు కడుగుతున్నట్లు దర్శించాలి .
5. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు సమర్పించాలి - '' హస్తయో అర్ఘ్యం సమర్పయామి '' అని ధారగా నీళ్ళు విడిచిపెట్టాలి .
వాళ్ళిద్దరూ చేతులు చాపి కడుగుతున్నట్లు దర్శించాలి. ఆ నీళ్ళు కింది పాత్రలో పడాలి .
6. భగవంతునికి మంత్ర పూరిత స్నానం చేయించాలి - పురుష సూక్తం / శ్రీ సూక్తం / నమకం /చమకం చేయవచ్చు . సమయం లేనిచో '' స్నానం సమర్పయామి '' అని కొద్ది నీరు సమర్పించి స్వామి వారు శిరసా స్నానం చేసినట్లు దర్శించాలి .
7.బట్టలు సమర్పిచాలి - '' వస్త్రయుగ్మార్ధం అస్ఖతాన్ సమర్పయామి '' అనో అక్షతలు సమర్పించాలి. మీరు సమర్పించిన బట్టలు కట్టుకున్నట్లు దర్శించాలి.
8. యజ్ఞోపవీతం సమర్పిoచాలి - '' యగ్నోపవితార్ధం అక్షతాన్ సమర్పయామి '' మీరిచ్చిన యగ్నోపవీతం స్వామివారు ధరించినట్లు గా మీరు దర్శించాలి.
9. గంధం సమర్పించాలి - ''గంధం సమర్పయామి'' స్వామి వారు రెండుచేతులు ముందు పెడతాడు గంధం పూయాలి . పాదాలకు కూడా గంధం పూయాలి .
10. పుష్పార్చన - అథంగాపూజా పాదాల నుంచి శిరస్సు వరకు చేస్తాము పూజా లేదా ఒక్కొక్క నామం చెప్తూ ఒక పూవు కాని అక్షత కాని సంర్పిచాలి .అష్టోత్తరo కాని సహస్రం కాని మీ ఇష్టం సమయంను అనుసరించి చేసుకోవచ్చు.
11. ధూపం - పుష్పార్చన అనంతరం ధూపం వేయాలి .
12. దీపం - భగవంతునికి దీపం చూపించాలి . దీపం మనలో్ని అజ్ఞానపు చీకట్లను పోగొడుతుంది.
13. నైవేద్యం - భాగ్వోతునికి నైవేద్యం ప్రీతితో నివేదించాలి . మద్య మద్యలో తాగడానికి నీళ్ళు అందించాలి . ఆయన భోజనం చేసి సుఖంగా కూర్చున్నట్లు భావన చేయాలి .
14. తాంబూలం - ''తాంబూలార్దం అక్షతాన్ సమర్పయామి '' అని అక్షత సమర్పించాలి .భగవంతుని నోరు ఎర్ర పడ్డట్టు దర్శించాలి .
15. నీరాజనం ( హారతి ) - కర్పూరం అవశేషం లేకుండా కాలిపోతుంది .స్థూల దశ నుంచి ఈ శరీరంలో ఉoడ బడిన నేను ఇంత వయసు అయిపోయింది కనుక ఇపుడు ఇటువంటి పూజ చేస్తున్నాను కనుక నేను నిన్ను చేరుకోగలిగినoత పూజ చేయగల సమయం నాకిక లేదు. అంత అర్చన నేను చేయలేను. ఆర్తి పొంది యున్నాను ఈ కర్పూరం ఎలా వాయస్థితి పొందేసిమ్దో ..అలా నేను నీవైపోదును గాక నీ కన్నా భిన్నముకాని స్థితిలో నేను నిలబడి పోఎదనుగాక. అని కోరుకోవడమే కర్పూరం వెలిగించడం .
16. మంత్ర పుష్పం - అక్షతలు పూలు చేతిలో పట్టుకొని భగవంతునికి నమస్కారం చేసి మీ కోరిక చెప్పుకొని వీలయితే సాష్టాంగం లేదా శిరసువంచి నమస్కారం చేయాలి .
ఇవియే షోడశోపచారాలు అనగా భగవంతునికి పూజలో మనము చేయవలసిన 16 ఉపచారాలు . ఈ ఉపచారాలు అన్నింటిలో మన భావన అత్యంత ముఖ్యం . ప్రతి ఉపచారం లో మనసు శరీరం రెండు ఉపచారం మీదే నిలిచి వుండాలి .
ఇలా మానం నిత్యం పూజ చేసుకోవచ్చు .

No comments:
Post a Comment