Monday, 21 December 2015

ఓం నమః శివాయ
ముక్కోటి ఏకాదశమి శుభాకాంక్షలు
వృత్రాసురుడు చేసిన అమోఘమైన విష్ణు స్తుతి


"ఆకలిగొన్న క్రేవులు రయంబున నీకలురాని పక్షులు 
 దీకొని తల్లికిం మరి విదేశగతుండగు భర్త కంగజ 
 వ్యాకులచిత్తయైన జవరాలును దత్తర మందు భంగి నో 
 శ్రీ కర ! పంకజాక్ష ! నిను జేరగ నామది గోరేడుం గదే !"

తా : " ఈకలు రాణి పక్షులకు వొళ్ళంతా మామ్సవికారంగా ఉంటుంది . ఒక్క ఈక ఉండదు . అవి గూళ్ళలో ఉండి నోల్లువిప్పి అమ్మ తీసుకు వచ్చిన గింజలను తింటూ ఉంటాయి . అమ్మ అరుపు వినబడగానే అమ్మకోసం నోరు తెరచిన ఈకలు రాని  పక్షిలా , చాలాకాలం క్రితం విదేశాలకు వేల్లిపోయిన భర్త తిరిగి వస్తే ఆయనతో కలసి ఉండాలని కోరుకున్న మహాప్రతివతలా నేను శ్రీమన్నారాయణుని పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్నవాడిని . అందుకని తొందరగా నీ వజ్రాయుధమును నా మీద ప్రయోగించి నన్ను తుదముట్టించు అన్నాడు "  
అంతటి మహా భక్తుడు వృత్రాసురుడు.

Friday, 18 December 2015

ఓం నమః శివాయ
భక్తులు  9 విధములు ఉన్నారు
   "శ్రవణం కీర్తనం విష్ణో : స్మరణం పాదసేవనం 
    అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం "

శ్రవణం - వినుట . ఎవరిలా వినాలి ? పరిక్షిత్ మహారాజు ల వినాలి . విని పరిక్షిత్ మోక్షం పొందాడు అలా వినడం వస్తే చాలు మోక్షం వస్తుంది .
కీర్తనం - పరవిశించి చెప్పుకోవడం . ఎవరిలా చెప్పుకోవాలి ? శుకుడిలా చెప్పుకోవాలి . అలా చెప్పుకొని శుకుడు మోక్షం పొందాడు .
స్మరణం - తలచుకోవడం . ఎవరిలా తలచుకోవాలి ? ప్రహ్లాదుడిలా తలచుకోవాలి . తలచుకోక్ని తలచుకొని మోక్షం పొందేశాడు ప్రహ్లాదుడు .
పాదసేవనం - స్వామివారి పాదములను సేవించుట . అనగా అర్చన చేయడం . స్వామివారిపాద సేవకు ఎవర్ని చెపుతారు ? లక్ష్మీదేవిని చెపుతారు .
అర్చనం - పుజచేయడం . పుజచేయడానికి ఎవరిని చెపుతారు ? పృథుమహారాజు గారిని చెపుతారు .
వందనం - నమస్కారం చేయడం . వందనం ఎవరికీ చెపుతారు ? అక్రూరిడికి చెపుతారు .
సఖ్యం - స్నేహం . స్నేహమునకు ఎవరిని చెపుతారు ? అర్జునిని చెపుతారు .
దాస్యం - దాస్యమునకు హనుమానుని చెపుతారు .
ఆత్మనివేదనం - ఆత్మనివేదనంనకు బలి చక్రవర్తిని చెపుతారు .
వీరందరూ ఆయా మార్గాలను అనుసరించి ముక్తిని పొందారు. మనకు మనం అనుసరిచాల్సిన మార్గాన్ని చూపించారు . మనం ఏ ఒక్క మార్గాన్ని పట్టుకున్న తరించవచ్చు అని తెలుపుతుంది భాగవతం .

Wednesday, 16 December 2015

ఓం నమః శివాయ
" కుపుత్రేనా వయోనష్టం జన్మనష్టం కుభార్యయా 
    కుభోజనేన దివసః కుమిత్రేనా సుఖం కుతః "
           
మిత్రుడిని సరైనవాడిని పెట్టుకోకపోయినా , కనపడిన ప్రతీవానితో మీరు స్నేహం చేసినా మీకు జీవితంలో సుఖము అన్నది ఉండదు . వాడు పాడుచేస్తాడు . అందుకని కుపుత్రుడు , కుభార్య , కుభోజనం , కుమిత్రుడు ఈ నాలిగింటి వలన జీవితంలో చాల నష్టం జరుగుతుంది . ఒక జన్మ వృధా అవుతుంది  అని వ్యాసులవారు దేవిభాగ్వాతంలో తెలిపారు .

Tuesday, 15 December 2015

ఓం నమః శివాయ
శోకము మనలోని శక్తిని హరింపచేస్తుంది - కాలము ఎంత బలవత్తరమో  భీష్ముల వారు మనకు తెలియచేసిన స్తుతి

శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే శ్రుతం 
శోకో నాశయితే సర్వం నాస్తి శోకసమో తిపు :
                                                             ( శ్రీ రామాయణం అయోధ్యకాండ -62-15)

             శోకం ఆవహి చగానేముందు ధైర్యం పోతుంది . తర్వాత ఏది విన్నాడో అది పోతుంది . పిరికివాడు అయిపోతాడు . ఆలోచన ఉండదు . కాబట్టి తొందరగా నశిమ్చిపోతాడు . ఆ కష్టమునకు పడిపోతాడు . పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులను ఎల్లప్పుడు వింటూ ఉండాలి . అందుకని భాగవతం లోని కొన్ని పద్యములను మీరు వేధనండు పెట్టుకోవాలి కష్టంరాని జీవితం ఉంటుందనే నమ్మకం ఎవరికీ ఉండదు .ఏమో ఎటునుంచి కష్టం వస్తుందోనని ప్రతిక్షణం అనుమానమే! వచ్చిన కష్టమను మనం తుడుచివేసి దానిని మనం లేకుండా చేసుకోలేము . కాబట్టి ఆ కష్టం తట్టుకొనే శక్తి మనకు కావాలి . అటువంటి శక్తి మనకు ఉన్నట్లయితే మనం మన స్వస్థితి నుండి జారిపోము . దానిని తట్టుకుంటాము . ఇంకొకరికి ఉపకరించగలుగుతాము . అలా తట్టుకునేటట్లు చేయగలిగినవి కొన్ని మాత్రమె ఉంటాయి . అటువంటి వాటిలో భాగవతంలోని భీష్మస్తుతి ఒకటి .
            జీవతంలో మనం దేనికి లోమ్గుతాం ? కష్టములకు లోమ్గుటాము . అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజును చూసి అన్నాడు  - " కుంతి ఎన్ని కష్టాలు పదిమ్దయ్యా ! పాండురాజు చిన్నతనంలో చనిపోయాడు . మీరు తండ్రి లేని బిడ్డలై పెరిగారు . ఎట్టకేలకు మీకు రాజాదిపత్యము వచ్చింది . ఇన్ని వచ్చిన కష్టం మిమ్ముల్ని వదలలేదు ."
రాజట ధర్మజుండు , సురరాజసుతుండట ధన్వి , శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట , సారధి సర్వభద్ర సం
యోజకమైన చక్రి యట , యుగ్రగదాధరుడైన భీము డ
య్యజుకి దోడు వచ్చునట , యాపద గల్గుటిదేమి చోద్యమో !
ఇంత గొప్ప అర్జునుడు , ఇంత గొప్ప గాండీవం , ఇంత గొప్ప కృష్ణపరమాత్మ , ఇంత గొప్ప భీముడు , ఇంత గొప్ప రాజయిన ధర్మజునికంటే రక్షణ ఉన్నవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ? ఎవ్వరు లేరు . అలాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు . మీకు ఆపద రావడం ఏమిటి ? అని భీష్ములవారు కాలము ఎంత బలవత్తరమో తెలిపాడు .
               కాలంలో మన పాపములు కష్టముల రూపంలో బాధిస్తాయి , మన పుణ్యములు సుఖంల రూపంలో సంతోషపెడుతాయి . ధర్మమును ఆలంబనం చేసుకొని మనము జీవించాలి .. కాలంలో మనకు రావలసిన కష్టం తప్కక వస్తుంది  , సుఖము తప్పక వస్తుంది . కష్టాన్ని తట్టుకొనే శక్తిని ఇవ్వమని మనము ఆ భగవంతున్ని వేడుకోవాలి ..
     

Sunday, 13 December 2015

ఓం నమః శివాయ
సాష్టాంగనమస్కారం అనగా...

రెండు చేతులు , రెండు కాళ్ళు , రెండు మోకాళ్ళు , వక్షము , శిరస్సు , మనస్సు , వాక్కు , ద్రుష్టులచే నమస్కారం చేయుటయే సాష్టాంగనమస్కారం అనబడును .
ఓం నమః శివాయ
వేదము అనగా ..??

తెలుసుకోవడం అని అర్ధం.
తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి ఏమి లేదు అని తెలిపేదే వేద విద్య .

నాలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలిపే బ్రహ్మజ్ఞానం వేద విద్య . 

Thursday, 10 December 2015

ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
విభీషణుడు లంకను విడిచి శ్రీ రాముల వారిని శరణువేడినపుడు వానర రాజు సుగ్రీవుడు ఇతర మంత్రులు రాక్షసుడు అయిన రావణ సోదరుడు పై విశ్వాసం లేని వారై వుండిరి అప్పుడు శ్రీ రాముడు శరణుజొచ్చిన వారిని రక్షించాలి అని పూర్వం జరిగిన ఒక సంఘటన గూర్చి తెలిపాడు
" పూర్వకాలంలో ఒక చెట్టు మిద రెండు పావురములు ఉండేవి . అవి ఒక ఆడ పావురము , ఒక మగ పావురం . ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు . అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు . బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు . ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా  బాధ పడింది . కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి , ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు . తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి , పూర్వం తానూ ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు . అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్లి నాలుగు ఎండు పుల్లల్ని తీసుకొచ్చి ఎక్కడినుంచో అగ్నిని తీసుకొచ్చినిప్పు
పెట్టింది . అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు .ఆకలితో వున్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది . తన భార్యని చంపినా బోయవాడు తన చెట్టు దెగ్గరికి వచ్చి పడిపోతే , ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి , తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది . నేను మనుష్యుడిలా పుట్టి  , క్షత్రియ వంశ సంజాతుడనై , దశరథుడి కొడుకుని , నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి , నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజును అవుతాన ? క్షత్రియుడను అవుతాన ? ఈ భూలోకంలో వున్నా సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే , వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను .
శరణాగతి చేసినవాడు బలహినుడై , శరణు  ఇవ్వవలసిన వాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే , వాడు చూస్తుండగా శరణాగతి  చేసినవాడు మరణిస్తే ,మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఉర్ద్వలోకాలకి వెళ్ళిపోతాడు . రక్షించనివాడి కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి . అందుచేత నేను విభీషణుడుకి శరణు ఇస్తున్నాను , ఆయనను తీసుకురండి " అన్నాడు .     

Wednesday, 9 December 2015

ఓం నమః శివాయ
"క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః  చ పుత్రికా: !
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్టితం జగత్ !!
"

తా : " ఓర్పే అందం , ఓర్పే దానం , అన్నిటికంటే గొప్ప కీర్తి ఓర్పే , ఓర్పుకు మించిన యజ్ఞం లేదు , ఒర్పుని మించిన సత్యం లేదు , ఓర్పును మించిన ధర్మం లేదు , ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతుంది "

Tuesday, 8 December 2015

ఓం నమః శివాయ
బలయుతుడైన వేళ నిజబందుడుతోడ్పడుగాని యాతడే
బలము తొలంగెనేమి తనపాలిటశత్రు , వదెట్లు బూరుణడై
జ్వలనుడుకానగాల్చు తరిసంఖ్యముజూపును వాయుదేవుడా
బలియుడు సుక్ష్మదీపమగుపట్టును నార్పడేగాలి భాస్కరా

తా: అగ్ని నిండుబలము కలవాడై అడవిని కాల్చు సమయమునా వాయుదేవుడు స్నేహము
 చూపుచు తోడ్పడును . ఆ అగ్ని చిన్నదీపము అయి ఉన్న సమయమున ఆ గాలిదేవుడే విరోధియై ఆర్పును . ఆ విధముగానే మానవుడు బలవంతుడిగా ఉన్నపుడు బంధువులు తోడ్పడుదురు . బలము లేనప్పుడు తన బంధువులే తనకు శత్రువులై కీడుచేయుదురు .
ఓం నమః శివాయ
ఒరులేయని యొనరించిన
నరవర యప్రియము తన మనంబున కగుతా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమధర్మ పథముల కెల్లన్                     ( విదుర నీతి )

తా : ఎదుటివారు ఏం చేస్తే నీ మనసుకు విపరీతమైన బాధ కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరులపట్ల చేయకుండా వుండటమే అన్ని ధర్మాలలో కెల్లా ఉత్తమ ధర్మం .

Tuesday, 1 December 2015

ఓం నమః శివాయా
గోవును పారాశక్తి గా అమ్మగా భావించి పూజిస్తున్న హిందువుల మనో భావాలు దెబ్బతీసి హిందువుల దేవతలను అవమానించటం కోసం ఉస్మానియాలో జరగపోతున్న గో వధ గో మాంస భక్షణను ప్రతీ హిందువు అడ్డుకోవాలి . పర మత సహనం కేవలం హిందువులకు మాత్రమేనా ...? ఇతరుల మనో భావాలను గౌరవించటం తెలవని వాళ్ల విషయంలో ప్రభుత్వంకు భాత్యత లేదా.......???????????

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...