Tuesday, 15 December 2015

ఓం నమః శివాయ
శోకము మనలోని శక్తిని హరింపచేస్తుంది - కాలము ఎంత బలవత్తరమో  భీష్ముల వారు మనకు తెలియచేసిన స్తుతి

శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే శ్రుతం 
శోకో నాశయితే సర్వం నాస్తి శోకసమో తిపు :
                                                             ( శ్రీ రామాయణం అయోధ్యకాండ -62-15)

             శోకం ఆవహి చగానేముందు ధైర్యం పోతుంది . తర్వాత ఏది విన్నాడో అది పోతుంది . పిరికివాడు అయిపోతాడు . ఆలోచన ఉండదు . కాబట్టి తొందరగా నశిమ్చిపోతాడు . ఆ కష్టమునకు పడిపోతాడు . పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులను ఎల్లప్పుడు వింటూ ఉండాలి . అందుకని భాగవతం లోని కొన్ని పద్యములను మీరు వేధనండు పెట్టుకోవాలి కష్టంరాని జీవితం ఉంటుందనే నమ్మకం ఎవరికీ ఉండదు .ఏమో ఎటునుంచి కష్టం వస్తుందోనని ప్రతిక్షణం అనుమానమే! వచ్చిన కష్టమను మనం తుడుచివేసి దానిని మనం లేకుండా చేసుకోలేము . కాబట్టి ఆ కష్టం తట్టుకొనే శక్తి మనకు కావాలి . అటువంటి శక్తి మనకు ఉన్నట్లయితే మనం మన స్వస్థితి నుండి జారిపోము . దానిని తట్టుకుంటాము . ఇంకొకరికి ఉపకరించగలుగుతాము . అలా తట్టుకునేటట్లు చేయగలిగినవి కొన్ని మాత్రమె ఉంటాయి . అటువంటి వాటిలో భాగవతంలోని భీష్మస్తుతి ఒకటి .
            జీవతంలో మనం దేనికి లోమ్గుతాం ? కష్టములకు లోమ్గుటాము . అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజును చూసి అన్నాడు  - " కుంతి ఎన్ని కష్టాలు పదిమ్దయ్యా ! పాండురాజు చిన్నతనంలో చనిపోయాడు . మీరు తండ్రి లేని బిడ్డలై పెరిగారు . ఎట్టకేలకు మీకు రాజాదిపత్యము వచ్చింది . ఇన్ని వచ్చిన కష్టం మిమ్ముల్ని వదలలేదు ."
రాజట ధర్మజుండు , సురరాజసుతుండట ధన్వి , శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లట , సారధి సర్వభద్ర సం
యోజకమైన చక్రి యట , యుగ్రగదాధరుడైన భీము డ
య్యజుకి దోడు వచ్చునట , యాపద గల్గుటిదేమి చోద్యమో !
ఇంత గొప్ప అర్జునుడు , ఇంత గొప్ప గాండీవం , ఇంత గొప్ప కృష్ణపరమాత్మ , ఇంత గొప్ప భీముడు , ఇంత గొప్ప రాజయిన ధర్మజునికంటే రక్షణ ఉన్నవారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ? ఎవ్వరు లేరు . అలాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు . మీకు ఆపద రావడం ఏమిటి ? అని భీష్ములవారు కాలము ఎంత బలవత్తరమో తెలిపాడు .
               కాలంలో మన పాపములు కష్టముల రూపంలో బాధిస్తాయి , మన పుణ్యములు సుఖంల రూపంలో సంతోషపెడుతాయి . ధర్మమును ఆలంబనం చేసుకొని మనము జీవించాలి .. కాలంలో మనకు రావలసిన కష్టం తప్కక వస్తుంది  , సుఖము తప్పక వస్తుంది . కష్టాన్ని తట్టుకొనే శక్తిని ఇవ్వమని మనము ఆ భగవంతున్ని వేడుకోవాలి ..
     

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...