Thursday, 10 December 2015

ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
విభీషణుడు లంకను విడిచి శ్రీ రాముల వారిని శరణువేడినపుడు వానర రాజు సుగ్రీవుడు ఇతర మంత్రులు రాక్షసుడు అయిన రావణ సోదరుడు పై విశ్వాసం లేని వారై వుండిరి అప్పుడు శ్రీ రాముడు శరణుజొచ్చిన వారిని రక్షించాలి అని పూర్వం జరిగిన ఒక సంఘటన గూర్చి తెలిపాడు
" పూర్వకాలంలో ఒక చెట్టు మిద రెండు పావురములు ఉండేవి . అవి ఒక ఆడ పావురము , ఒక మగ పావురం . ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు . అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు . బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు . ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా  బాధ పడింది . కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి , ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు . తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి , పూర్వం తానూ ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు . అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్లి నాలుగు ఎండు పుల్లల్ని తీసుకొచ్చి ఎక్కడినుంచో అగ్నిని తీసుకొచ్చినిప్పు
పెట్టింది . అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు .ఆకలితో వున్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది . తన భార్యని చంపినా బోయవాడు తన చెట్టు దెగ్గరికి వచ్చి పడిపోతే , ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి , తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది . నేను మనుష్యుడిలా పుట్టి  , క్షత్రియ వంశ సంజాతుడనై , దశరథుడి కొడుకుని , నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి , నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజును అవుతాన ? క్షత్రియుడను అవుతాన ? ఈ భూలోకంలో వున్నా సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే , వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను .
శరణాగతి చేసినవాడు బలహినుడై , శరణు  ఇవ్వవలసిన వాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే , వాడు చూస్తుండగా శరణాగతి  చేసినవాడు మరణిస్తే ,మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఉర్ద్వలోకాలకి వెళ్ళిపోతాడు . రక్షించనివాడి కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి . అందుచేత నేను విభీషణుడుకి శరణు ఇస్తున్నాను , ఆయనను తీసుకురండి " అన్నాడు .     

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...