|
భగవద్గీత 2-63
|
|||||||
|
"
శ్రీకృష్ణామృతం " ... "
భగవద్గీత
విజ్ఞానసారం "
|
|||||||
|
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
|
|||||||
|
" క్రోధాద్భవతి సమ్మోహ:
సమ్మోహాత్ స్మృతివిభ్రమ:
|
|||||||
|
స్మృతిభ్రాంశాద్ద్బుద్దినాశో బుద్ధినాశాత్
ప్రణశ్యతి !! "
|
|||||||
|
తాత్పర్యం :
|
" కోపం వలన అవివేకం , అవివేకం వల్ల
స్మృతిభ్రంశం , దాని వలన బుద్ది చెడతాయి ;
|
||||||
|
ఆ బుద్ది
చెడగానే పురుషుడు నశించిపోతాడు ."
|
|||||||
|
ధ్యాన వివరణ :
|
|||||||
|
విషయాసక్తి వల్ల సంగం పెరుగుతుంది .
|
|||||||
|
సంగం వల్ల కోరిక కలుగుతుంది .
|
|||||||
|
కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది.
|
|||||||
|
ఈ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది .
|
|||||||
|
" సమ్మోహం " అంటే " విపరీతమైన మోహం ."
|
|||||||
|
" అది లేకపోతే ఉండలేను " అన్నంత మోహం .
|
|||||||
|
ఆ స్థితిలో వివేకం నశిస్తుంది ...
|
|||||||
|
జ్ఞానం నశిస్తుంది ...
|
|||||||
|
బుద్ది నశిస్తుంది ...
|
|||||||
|
అహంకారం విజృంభిస్తుంది .
|
|||||||
|
చేస్తున్న పని యొక్క పరిణామాలనూ ,
|
|||||||
|
మంచి చెడులనూ
|
|||||||
|
ఏ మాత్రం పట్టించుకోం .
|
|||||||
|
సత్యాసత్యాలను , ఉచితానుచితాలు మరచిపోతాం ;
|
|||||||
|
విచక్షణా జ్ఞానం కోల్పోతాం ;
|
|||||||
|
మనిషి తన స్థితి నుండి పతనమై పోతాడు.
|
|||||||
|
కనుక బుద్ది నశించుటయే " చావు " ... అంతకంటే వేరే చావు లేదు .
|
|||||||
|
మాయసభలో సుయోధనుడి భంగపాటు చూసి ద్రౌపది
నవ్వింది .
|
|||||||
|
దానితో వాణి బుద్ది నశించింది . వాడివల్ల వాడు
నాశనం అయ్యాడు ;
|
|||||||
|
తద్వారా ప్రపంచం అంతా నాశనం అయ్యింది .
|
|||||||
|
ఒక గుడ్డి ఎద్దు చేలో పడితే దానికి నష్టమే , చేనుకి నష్టమే
.
|
|||||||
|
మొహంధకారంలో ఉన్నవాడు ... విలువలు తలక్రిందులు
అయినవాడు ...
|
|||||||
|
తాను చెడిపోయి ఇతరులకు కూడా చెడుపు చేస్తాడు .
|
|||||||
|
మానవుడు ఏరకంగా పతనవవుతాడో వేదవ్యాసులవారు
ఇక్కడ చెప్పారు .
|
|||||||
|
మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో
మార్గాన్ని సూచిస్తున్నారు .
|
|||||||
|
ఆదిశంకరాచార్యులవారు వారి యొక్క " భజగోవిందం " లో
|
|||||||
|
" సస్సంగత్వే నిస్సంగత్వం , నిస్సంగత్వే
నిర్మోహత్వం
|
|||||||
|
నిర్మోహత్వే నిశ్చలచిత్తం , నిశ్చలచిత్తే
జీవన్ముక్తి : "
|
|||||||
|
సజ్జనులతో సత్కలాక్షేపం చేస్తూ ఉంటే ప్రాపంచిక
విషయాసక్తి నశిస్తుంది .
|
|||||||
|
విషయాసక్తి తగ్గితే ... కోరికలు తగ్గి ... క్రమంగా మోహం
నశిస్తుంది ;
|
|||||||
|
తద్వారా మనసు నిశ్చలమౌతుంది .
|
|||||||
|
నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు.
శ్రీ ఆదిశంకరాచార్యులవారు !
|
|||||||
Monday, 27 April 2020
Sunday, 26 April 2020
|
భగవద్గీత 2-41
|
|||||||
|
"
శ్రీకృష్ణామృతం " ... "
భగవద్గీత
విజ్ఞానసారం "
|
|||||||
|
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
|
|||||||
|
" ఏవం ప్రవర్తితం చక్రం
నానువర్తయతీహ యః !
|
|||||||
|
అఘాయురింద్రియారామో
మోఘం పార్ధ స జీవతి !! "
|
|||||||
|
తాత్పర్యం :
|
" అర్జునా ! ఈ లోకంలో ఈ విధమైన
సృష్టిచక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో ,
|
||||||
|
అతడు
ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్ధంగా
జీవిస్తున్నాడు."
|
|||||||
|
ధ్యాన వివరణ :
|
|||||||
|
నాలుగు క్షేత్రాలు ఉన్నాయి :
|
|||||||
|
ఒకటి - బౌతీక క్షేత్రం
|
|||||||
|
రెండు - ప్రాణశక్తి క్షేత్రం
|
|||||||
|
మూడు - భావనా క్షేత్రం
|
|||||||
|
నాలుగు - ఆత్మ క్షేత్రం
|
|||||||
|
భౌతిక క్షేత్రానికి మూలం ప్రాణశక్తి క్షేత్రం ;
|
|||||||
|
ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రం ;
|
|||||||
|
భావనా క్షేత్రానికి మూలం ఆత్మ క్షేత్రం ;
|
|||||||
|
ఈ నాలుగు క్షేత్రాలకు మౌలికమైన క్షేతమ్ -
ఆత్మ క్షేత్రం !
|
|||||||
|
సృష్టి యొక్క ములక్రమం తెలుసుకున్న వాళ్ళు
|
|||||||
|
ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు ...
|
|||||||
|
పుణ్యచరితులై అర్ధపు జీవితాన్ని గడుపుతారు ;
|
|||||||
|
ఈ సృష్టిక్రమం తెలిసుకోని వారు ఇంద్రియాలకు
వశులవుతారు ;
|
|||||||
|
ఇంద్రియాలకు వశులై పాపపు జీవితం గడుపుతారు ;
|
|||||||
|
పాపచరితులై వ్యర్ధంగా కాలం గడుపుతున్నారు ;
|
|||||||
Subscribe to:
Posts (Atom)
🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు. ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...
-
ఓం నమః శివాయ భగవంతుని అనుభూతిని స్పర్శ నిరంతరం మనం పొందుతుందాలని కోరుకుంటే అష్టమూర్తి గా వున్నా ఆయనతో అనుబందం అంతటా పొందగలం అష్ట మూర్తి ...
-
ఓం నమః శివాయ తప్పక చదవుకోవలసిన శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ అపరాద క్షమాపణ స్తోత్రం

