|
భగవద్గీత 2-13
|
||||||
|
"
శ్రీకృష్ణామృతం " ... "
భగవద్గీత
విజ్ఞానసారం "
|
||||||
|
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
|
||||||
|
" దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం
యౌవనం జరా !
|
||||||
|
తథా
దేహంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి !! "
|
||||||
|
తాత్పర్యం :
|
" దేహం వలన దేహధారులకు బాల్యం , యవ్వనం , ముసలితనం
|
|||||
|
మొదలైనవి కలగటం ఎంత సహజమో , మరొక దేహాన్ని
పొందటం
|
||||||
|
కూడా అంతే సహజం ; ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు . "
|
||||||
|
ధ్యాన వివరణ :
|
||||||
|
ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను
ప్రారంభిస్తుంది .
|
||||||
|
పొత్తిళ్లలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు , సంవత్సరాలు
గడచి
|
||||||
|
బాల్యదశను అనుభవిస్తుంది .
|
||||||
|
బాల్యం తర్వాత కౌమారం , ఆ తర్వాత యవ్వనం ;
|
||||||
|
తర్వాత ప్రౌఢదశ , వార్ధక్యం , చివరగా మరణం ...
|
||||||
|
ఈ విధంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి .
|
||||||
|
ఒక దశలోని రూపం తర్వాతి దశకు మార్పు చెందింది .
|
||||||
|
ఒక స్థితి లోని శరీరం వేరొక స్థితిలోకి
చేరినప్పుడు అంతా మారిపోయింది .
|
||||||
|
" ఈ రూపం , ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి
? "
|
||||||
|
అని ఆయాదశలలో ఎప్పుడు మనం ఏడవటం లేదు !
|
||||||
|
ఎందుకంటే ...
|
||||||
|
" అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం "
|
||||||
|
అని మనకు కచ్చితంగా తెలుసు కనుక !
|
||||||
|
అయితే " మరణానికి దుఃఖిస్తున్నాం " ...
|
||||||
|
ఎందుకంటే ... " ఆత్మధర్మం " మనకు తెలియదు కనుక !
|
||||||
|
బాల్యంలో , యవ్వనంలో జరిగిన ముక్యమైన కొన్ని
సంఘటనలు
|
||||||
|
ఆ దశలు పూర్తి అయిన తర్వాతి దహలలో కూడా మనకు
గుర్తుంటాయి .
|
||||||
|
అవి అనుభవించినప్పటి రూపం , శరీరం ఇప్పుడు
లేకపోయినా
|
||||||
|
అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మంస్సులో
గుర్తుంటుంది .
|
||||||
|
అలాగే దేహంలో ఉన్న " దేహి " ఈ దేహం యొక్క
మరణంతో
|
||||||
|
ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు
...
|
||||||
|
ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో టేసుకుపోతుంది
...
|
||||||
|
అవే " సంస్కారాలు ".
|
||||||
|
బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది
.
|
||||||
|
యవ్వనరూపం పోయి ముసలిరూపం వచ్చింది .
|
||||||
|
అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత
|
||||||
|
" దేహి " ఇంకో దేహం తీసుకుంటుంది
.
|
||||||
|
జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబందించిన
|
||||||
|
పరిపూర్ణత సంతరించుకోవడానికి ...
|
||||||
|
ఈ సంస్కారాలను మోసుకొని , మరొక భౌతికదేహం
పొందుతుంది.
|
||||||
|
కనుక దేహస్థితి ఉంది ...
|
||||||
|
దేహంతరస్థితి ఉంది .
|
||||||
|
బాల్యం , యవ్వనం , వృద్ధాప్యం వంటి దేహస్థితులు
ఎంత సహజమో ...
|
||||||
|
మరో శరీరం పొందడం అంతే సహజం .
|
||||||
|
ఈ విషయాన్ని గురుంచి ధీరుడు అయినవాడు ,
|
||||||
|
ఆత్మసత్యాన్ని అనుభవించిన వాడు ...
|
||||||
|
మొహాన్ని ఎప్పుడూ పొందడు !
|
||||||
|
ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక ...
|
||||||
|
ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడు ఏడవడు ...
|
||||||
|
సదా తటస్థంగా ఉంటాడు ...
|
||||||
|
అధవా చిరునవ్వుతో ఉంటాడు !
|
||||||
Saturday, 25 April 2020
Subscribe to:
Post Comments (Atom)
🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు. ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...
-
ఓం నమః శివాయ భగవంతుని అనుభూతిని స్పర్శ నిరంతరం మనం పొందుతుందాలని కోరుకుంటే అష్టమూర్తి గా వున్నా ఆయనతో అనుబందం అంతటా పొందగలం అష్ట మూర్తి ...
-
ఓం నమః శివాయ తప్పక చదవుకోవలసిన శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ అపరాద క్షమాపణ స్తోత్రం

No comments:
Post a Comment