Friday, 24 April 2020

అష్టావక్ర గీత
శ్రీకృష్ణుల వారి గురువు సాందీప మహాముని , సాందీపులవారు   మరియు జనకుని  గురువు అష్టవకృల వారు
" జ్ఞానోదయమే ఏకైక విప్లవం "
Enlightenment : The Only Revolution
ఓషో రజనీష్ గారి వివరణ :
జనకుడు అడిగాడు : ఓ ప్రభు , ప్రజ్ఞను ఎలా సిద్దించుకోవాలి అని ...?
అష్టావక్రుడు బదులిచ్చాడు  :
 ఓ ప్రియతమా " నువ్వు విముక్తిని కోరుకుంటే కనుక విషయవాంఛలు  విషంలా త్యజించు ,
మరి క్షమాతత్వం , నిష్కాపట్యం , దయ , సంతృప్తి మరి సత్యాన్ని అమృతంలా స్వీకరించు ".
" నువ్ విముక్తి కోరుకుంటే కనుక విషయవాంఛలు విషంలా త్యజించు "
ఎంతో అర్ధవంతమైనది ఈ పదం. విషం అనే పదం విషయం నుంచి వచ్చింది .
విషం అంటే అర్ధం ఏమిటంటే , ఎవరైనా ఆ పదార్ధం తీసుకుంటే మరణిస్తారు .
విషయం అంటే అర్ధం ఏమిటంటే , మనం దానిని అనుభవిస్తే మళ్ళీ మళ్ళీ మరణిస్తాం.
విషయ వాంఛలతో మనం మళ్ళీ మళ్ళీ మరణిస్తాం .
విషయవాంఛలు విషం కంటే ప్రమాదం అని చెప్పారు.
" మరి క్షమతత్వం , నిష్కాపట్యం . దయ , సంతృప్తి మరి సత్యాన్ని అమృతంలా స్వీకరించు ".
అమృతం అంటే అర్ధం జీవితాన్ని ఇచ్చేది . అమరత్వాన్ని ఇచ్చేది . అమృతం... ఎవరైనా దానిని
కనుగొన్నపుడు వారు మళ్ళీ ఎన్నటికీ మరణించరు .
కోపం అనేది విషం , క్షమాతత్వం అనేది అమృతం .
కపటత్వం , వక్రబుద్ది అనేది విషం ... సరళత , నిష్కాపట్యం అనేది అమృతం .
క్రూరహృదయం , క్రూరత్వం అనేవి విషం ... జాలి , దయ అనేవి అమృతం .
సంతృప్తి - ఉన్నదానితో తృప్తి , లేని దాని కోసం కోరిక లేదు .
కళ్ళు తెరవండి నీకు ఏదైతో ఉందో అది  చాలా ఎక్కువగానే ఇవ్వబడింది  కళ్ళు తెరచి చూడు .
నీవు ఎదైతే  కోరుకున్నావో అది ఎల్లప్పుడు ఇవ్వబడింది . నువ్ దుఖాన్ని కౌరుకుంటే కనుక మీరు దుఖాన్ని పొందారు.
మీరు ఆనందాన్ని కోరుకుంటే గనుక ఆనందాన్ని పొందారు . మీరు ఏదైనా సరికానిది కోరుకుంటే కనుక సరికాని
దానినే పొందారు . మీ కొరికలే మీ జీవిత ఆకృతిని ఇచ్చాయి .
సత్యం -
కేవలం ప్రమాణీకత మరి సత్యం ద్వారా మాత్రమే మీరు అస్థిత్వం తో బాంధవ్యం కలిగి ఉండగలరు .
విషతుల్యమైన విషయాలను గమనించి త్యజించి  , అమృత తుల్యమైన క్షమా, నిష్కాపట్యం , దయ సంతృప్తి, సత్యాన్ని గమనించి
స్వేకరించిన విముక్తులము అవుతాము అని అష్టవకృల వారు జనకునకు బదులిచ్చాడు .




No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...