|
భగవద్గీత 2-28
|
|||||||||
|
భగద్గీత విజ్ఞానసారం - బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
|
|||||||||
|
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత !
|
|||||||||
|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవానా !!
|
|||||||||
|
తాత్పర్యం :
|
" అర్జునా ! ప్రాణులన్నీ పుట్టుకకు ముందూ కనపడవు ; మరణం తర్వాత కూడా కనపడవు ;
|
||||||||
|
మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి ; అటువంటప్పుడు
శోకించడము ఎందుకు ? "
|
|||||||||
|
ధ్యాన వివరణ :
|
|||||||||
|
ఒకడు నిద్రిస్తున్నపుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి
భార్య పిల్లలు , మేడలు, ఐశ్వర్యం ...అన్నీ ఉంటాయి.
|
|||||||||
|
నిద్ర లేచాక చూస్తే భార్య , పిల్లలు , మేడలు , ఐశ్వర్యం
..ఇవేమీ ఉండవు .
|
|||||||||
|
నిద్ర పోక ముందు ఇవేమీ లేవు ... నిద్ర లేచాక కూడా
లేవు .
|
|||||||||
|
కానీ మధ్యలో స్వప్నంలో ..స్వప్న జగత్తులో
అవన్నీ ఉన్నాయి .
|
|||||||||
|
వాస్తవంగా మాత్రము లేవు.
|
|||||||||
|
ఆదిలోను లేక ... అంతములోను లేక ..మధ్యలో మాత్రం ఉంటే ...
|
|||||||||
|
అది మిధ్యావస్తువే! మిధ్యా జగత్తు బ్రాంతి
మాత్రమే !
|
|||||||||
|
ఎడిస్తే ... శోకీస్తే ...ఆ స్వప్నములోని
భార్యా , పిల్లలు , ఐశ్వర్యము ... ఇవన్నీ రావు.
|
|||||||||
|
అటువంటి వాటి కోసము దుక్కించడము ఎందుకు...?
|
|||||||||
|
అలాగే పుట్టుక , చావుల మధ్యలో
మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు .
|
|||||||||
|
ఆత్మ అనేది పుట్టుకకు ముందు ఉంది కానీ ,
|
|||||||||
|
శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది.
|
|||||||||
|
పుట్టిన తర్వాత నుంచి , అంటే మధ్యలో ...శరీరధారి
అయ్యింది కబట్టి మళ్ళీ కనిపిస్తుంది .
|
|||||||||
|
మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ
కనిపించదు .కనుక ఆత్మ నిత్యమైనది ...శరీరం అనిత్యమైనది .
|
|||||||||
|
పుట్టుకకు ముందూ లేని ...మరణము తర్వాత లేని ...
|
|||||||||
|
చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే ...
|
|||||||||
|
ఆశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం ...ధూఖించడం
అవివేకం !
|
|||||||||
Wednesday, 22 April 2020
Subscribe to:
Post Comments (Atom)
🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు. ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...
-
ఓం నమః శివాయ భగవంతుని అనుభూతిని స్పర్శ నిరంతరం మనం పొందుతుందాలని కోరుకుంటే అష్టమూర్తి గా వున్నా ఆయనతో అనుబందం అంతటా పొందగలం అష్ట మూర్తి ...
-
ఓం నమః శివాయ తప్పక చదవుకోవలసిన శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ అపరాద క్షమాపణ స్తోత్రం

No comments:
Post a Comment