Monday, 27 April 2020

భగవద్గీత 2-63
"  శ్రీకృష్ణామృతం " ... "  భగవద్గీత విజ్ఞానసారం "
  బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
" క్రోధాద్భవతి సమ్మోహ: సమ్మోహాత్ స్మృతివిభ్రమ:
స్మృతిభ్రాంశాద్ద్బుద్దినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి !! "
తాత్పర్యం :
" కోపం వలన అవివేకం , అవివేకం వల్ల స్మృతిభ్రంశం , దాని వలన బుద్ది చెడతాయి ;
ఆ బుద్ది చెడగానే పురుషుడు నశించిపోతాడు ."
ధ్యాన వివరణ :
విషయాసక్తి వల్ల సంగం పెరుగుతుంది .
సంగం వల్ల కోరిక కలుగుతుంది .
కోరిక  తీరకపోతే క్రోధం వస్తుంది.
ఈ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది .
" సమ్మోహం " అంటే " విపరీతమైన మోహం  ."
" అది లేకపోతే ఉండలేను " అన్నంత మోహం  .
ఆ స్థితిలో వివేకం నశిస్తుంది ...
జ్ఞానం నశిస్తుంది ...
బుద్ది నశిస్తుంది ...
అహంకారం విజృంభిస్తుంది .
చేస్తున్న పని యొక్క పరిణామాలనూ ,
మంచి చెడులనూ
ఏ మాత్రం పట్టించుకోం .
సత్యాసత్యాలను , ఉచితానుచితాలు మరచిపోతాం ;
విచక్షణా జ్ఞానం కోల్పోతాం ;
మనిషి తన స్థితి నుండి పతనమై పోతాడు.
కనుక బుద్ది నశించుటయే " చావు " ... అంతకంటే వేరే చావు లేదు .
మాయసభలో సుయోధనుడి భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది .
దానితో వాణి బుద్ది నశించింది . వాడివల్ల వాడు నాశనం అయ్యాడు ;
తద్వారా ప్రపంచం అంతా నాశనం అయ్యింది .
ఒక గుడ్డి ఎద్దు చేలో పడితే దానికి నష్టమే , చేనుకి నష్టమే .
మొహంధకారంలో ఉన్నవాడు ... విలువలు తలక్రిందులు అయినవాడు ...
తాను చెడిపోయి ఇతరులకు కూడా చెడుపు చేస్తాడు .
మానవుడు ఏరకంగా పతనవవుతాడో వేదవ్యాసులవారు ఇక్కడ చెప్పారు .
మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు .
ఆదిశంకరాచార్యులవారు వారి యొక్క " భజగోవిందం " లో
" సస్సంగత్వే నిస్సంగత్వం , నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలచిత్తం , నిశ్చలచిత్తే జీవన్ముక్తి : "
సజ్జనులతో సత్కలాక్షేపం చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాసక్తి నశిస్తుంది .
విషయాసక్తి తగ్గితే ... కోరికలు తగ్గి ... క్రమంగా మోహం నశిస్తుంది ;
తద్వారా మనసు నిశ్చలమౌతుంది .
నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు. శ్రీ ఆదిశంకరాచార్యులవారు !




No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...