Sunday, 3 May 2020

భగవద్గీత 6-25
"  శ్రీకృష్ణామృతం " ... "  భగవద్గీత విజ్ఞానసారం "
  బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
" శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా !
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ !! "
తాత్పర్యం :
" మనస్సుతో ఇంద్రియ నిగ్రహంచేసి , ధీరుడై , ప్రాపంచిక విషయాల నుంచి
బుద్ధిని దూరం చేసి మనస్సును ఆత్మలోనే సామ్యమం చేసి ఇతర ఆలోచనలు ,
చింతలూ లేకుండా ఉండాలి . "
ధ్యాన వివరణ :
బాహ్య చింతనకు అలవాటు పడిన మనస్సును బుద్ధితో  నిగ్రహించి ,
ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి ,
అంతర్ముఖమయ్యేటట్లు , ఆత్మలో స్థితమయ్యేటట్లు చెయ్యాలి .
మళ్ళీ మళ్ళీ ఆ మనస్సులో ఇతర విషయ ఆలోచనలు ఏవి వచ్చిన ,
వెంటనే వాటిని వదిలిపెట్టెయ్యాలి .
 ఇలా నెమ్మది నెమ్మదిగా , ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి .
ధ్యానసాధనలో సాహనమే మహాసహసం
ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యం .
( మాంసాహారం మనిషి యొక్క జీవశక్తిని నశింపచేసి ,
మానసిక శక్తిని నాశనం చేసి , మనల్ని మన " మూలచైతన్యం "
లోనికి వెళ్లకుంట ఆటంకపరుస్తుంది .)
( శాకాహారం అమృతాహారం !  ధ్యానం అంటే .. శ్వాస మీద ధ్యాస ! )

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...