Monday, 11 May 2020

భగవద్గీత 2-47
"  శ్రీకృష్ణామృతం " ... "  భగవద్గీత విజ్ఞానసారం "
  బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
" కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన !
మా కర్మఫల హేతుర్బూః మా తే సంగోఅస్త్వకర్మణి !! "
తాత్పర్యం :
" నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగాని , ఆ కర్మఫలానికి అధికారివి కాదు ;
ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు . "
ధ్యాన వివరణ :
కర్మలు చేయడానికి మనకు హక్కు వుంది !
కర్మలను సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి !
ఎప్పుడూ " కర్మిష్టి " గానే ఉండాలి !
 అకర్మనత్వం ' అన్నది ఎప్పుడు కూడా ఉండకూడదు !
నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతనే జీతం వస్తుంది ...
ఫలితాన్ని తరువాతి నెలలోనే అనుభవించ గలుగుతాం .
వర్తమానంలో దుక్కిదున్ని , విత్తు చల్లి , చేనుకు సంరక్షణ చేస్తేనే ...
భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది .
విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు !
అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా !
వర్తమానంలోని సుఖసంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలు ...
కష్టాలు , నష్టాలు చెడు కర్మల ఫలితాలు .
అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం .
ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ...
ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు ...
మన యొక్క అనేకానేక గత జన్మలలోని ... ఏ జన్మకు సంభందించినవి ...
ఏ కర్మ ఫలం అన్నది అవగాహనకు  రాదు ... మనం నిర్దేశించలేము కూడా !
అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడు " లెక్కలు " పెట్టకూడదు !
" లెక్కలు " కట్టడానికి మన దగ్గర సరైన " విషయజ్ఞానం "
ఏమి లేదు ! లెక్కలను , ఫలితాలను పూర్ణ సృస్తికే వదిలేయాలి !
సృష్టికి మాత్రమే తెలుసు " సరి అయిన లెక్కలు " కట్టడం !
జన్మ జన్మల లెక్కల ప్రకారం రావాల్సింది అంతా వచ్చే తీరుతుంది !
జన్మ జన్మల లెక్కల ప్రకారం పోవాల్సిందంతా పోయే తీరుతుంది !
                                                       
" కర్మఫలాసక్తి " ఉంటే ...
ఫల ' సిద్ది ' , ' ఆసిద్ది ' ల పట్ల రాగద్వేషాలను కలిగించి ...
కర్మాచరణ పూర్తి సామర్ధ్యంతో నిర్వహించ బడదు .
కర్మలు చేయడం మాని ఆకర్ముడిగా మారిపోతే ...
భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్ధం చేస్తే ...
భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతా౦ .
కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి .
ఆకర్ములుగా ఎన్నటికీ కారాదు .
దేనినయితే మనం " ధర్మం " అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్మిస్తూనే ఉండాలి .
ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి .
శాకాహారం అమృతాహారం ! ధ్యానం చేయు విధానం : సహజ  శ్వాసను గమనించుటయే ..
( " There Is No Coincidence , and Nothing Happens ' By Accident ' . " -
 " యాదృచ్చికం ' అన్నది ఎక్కడా లేదు , మరి ఏది ' ఆకస్మికంగా ' జరగనే జరగదు . " -
 నీల్ డొనాల్డ్ వాల్ష్ )




No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...