Tuesday, 5 May 2020

భగవద్గీత 6-25
"  శ్రీకృష్ణామృతం " ... "  భగవద్గీత విజ్ఞానసారం "
  బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
" సంశయం మహాబాహొ మనో దుర్నిగ్రహం చలమ్ !
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే !! "
తాత్పర్యం :
" అర్జునా ! నిస్సందేహంగా మనస్సనేది చంచలమైనది ! మరి నిగ్రహించడానికి
కష్టసాధ్యమైనది ! అయినప్పటికి అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా
నిగ్రహించవచ్చును ! "
ధ్యాన వివరణ :
" మనస్సు " అనేది అతి చంచలమైనదే !
దీనిని లొంగదీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే !
అయినప్పటికీ అకుంటిత దీక్షతో సాధన చెయ్యడం ద్వారానూ ...
మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారాను ...
దానిని సులభంగా నిగ్రహించవచ్చును .
" అకుంటిత దీక్ష " అంటే " ఏ రోజు కుంటుపడని దీక్ష " ...
ఆ విధమైన దీక్ష ఉండి తీరాలి ...
మనస్సును నియంత్రణలోకి తీసుకు రావాలంటే ...
ప్రతిరోజూ విధిగా ధ్యానసాధన వుండి  తీరాలి .
ఏ రోజు కూడా " రేపు చేస్తాను " అనరాదు .
ప్రతిరోజూ కూడా ధ్యానయోగసాధనకై వినియోగింప బడాలి !
" కుంటిత దీక్ష " ఉంటే ...
ఆత్మస్థితికి  చేరలేం ...
కావలసింది " అకుంటిత దీక్ష "!
ఇకపోతే " వైరాగ్యం "...
" శాస్త్రీయమైన వైరాగ్యం " వుండాలి ...
" అత్యాచారం "" పట్ల వైరాగ్యం ఉండాలి ...
ఏది ఎక్కువగా , అవసరమైన దానికి మించి చేయరాదు ...
ఎప్పుడూ  " మధ్యేమార్గం " లోనే జీవించాలి ...
అతి సర్వత్ర వర్జయేత్ !
అదే " శాస్త్రీయమైన వైరగ్యాన్ని కలిగి వుండడం " అంటే !
అలాంటప్పుడే ధ్యానయోగసాధన పుష్పిస్తుంది , ఫలిస్తుంది .
( మాంసాహారం మనిషి యొక్క జీవశక్తిని నశింపచేసి ,
మానసిక శక్తిని నాశనం చేసి , మనల్ని మన " మూలచయితన్యం "
లోనికి వెళ్లకుంట ఆటంకపరుస్తుంది .)
( శాకాహారం అమృతాహారం !  ధ్యానం అంటే .. శ్వాస మీద ధ్యాస ! )

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...