Thursday, 7 May 2020

భగవద్గీత 11-54
"  శ్రీకృష్ణామృతం " ... "  భగవద్గీత విజ్ఞానసారం "
  బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
" భక్త్యా త్వనన్యయా శక్య అహమేవ౦విధః అర్జున !
జ్ఞాతు౦ ద్రష్టుం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప !! "
తాత్పర్యం :
" అర్జునా ! అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని , చూసి , నాలో ప్రవేశించడానికి
సాధనం . "
ధ్యాన వివరణ :
" భక్తి " అంటే ఏమిటి ?
" స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది " ...
అని ఆదిశంకరుల వారి నిర్వచనం .
ఏ మానవుడు అయిన గాని తన యొక్క స్వ స్వరూపంతో 
అనుసంధానించబడి ఉండటమే " భక్తి " అని ఆయన ఉవాచ .
ఏమిటి  మానవుడి " స్వస్వరూపం " ?
" ఆత్మస్వరూపం " అన్నదే మానవుడి " స్వ స్వరూపం ".
తనను తను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడేమే ...
దర్శించుకోవడమే ...
తన ఆత్మలో తను ప్రవేశించడమే " భక్తి " .
వేరే ఇతర విషయాల పైకి పోనివ్వని " అనన్య భక్తి " కలిగి ఉండాలి .
అప్పుడే ఆత్మతత్వం అవగతం అవుతుంది .
 దాని కోసం ధ్యానసాధన చేసి తీరాలి ...
ఆత్మజ్ఞాని కావాలి .
( Go Ahead and Choose Being Better - But Not Better

Than Others ; Rather , Better Than You Were Before . " -

" నిన్నటి మీ కన్నా నేటి మీరు మెరుగుగా ఉండేలా

చూసుకోండి  - అంతే కానీ ఇతరుల కన్నా మెరుగుగా

మాత్రం కానేకాదు . " – నీల్ డొనాల్డ్ వాల్ష్ )


అహింసా పరమో ధర్మః

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...